Wednesday 12 March 2014

ఆలోచనామృత జలధార



నెలవంక మాస పత్రిక

ముచ్చటగా మూడు

మూడింటిని కాపాడుకోవాలి: ధర్మం - పరువు - దేశం
మూడు తక్కువగా ఉన్నా ఎక్కువే:  రోగం - శతృత్వం - అగ్ని కణం
మూడింటిలో జ్ఞానం దాగుంది:  పశ్న్ర - పుస్తకం - అనుభవం
మూడింటిని అదుపులో ఉంచుకోవాలి: నాలుక - మనసు - అవయవాలు
మూడింటిలో జీవితం విలువ దాగుంది:
సత్కార్యాలు - సజ్జన సంతానం - పయ్రోజనకరమైన జ్ఞానం
మూడు నిత్యం అవసరం: గాలి - నీరు - ఆహారం
ముగ్గురు వ్యక్తులకు అపరిచిత పాత్రంలో సయితం భయం ఉండదు:
ధీర శాలి అయి యోధుడు - స్థిత పజ్ఞ్రుడైన పండితుడు - నోరు మంచిదైన వ్యక్తి
మూడు రకాల ప్రజలు: ఆహారం లాంటివారు, వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది - మందుమాకు వంటి వారు. వీరి అవసరం అప్పుడప్పుడు ఉంటుంది. - రోగంలాంటి వారు. వీరి అవసరం ఎవరికీ ఎప్పుడూ ఉండకూడదు.

ఖాలిద్‌ మరియు చిట్టి చిలుక 

ఖాలిద్‌  మంచి బాలుడు. అతనికి పక్షులంటే చాలా ఇష్టం. ఒక రోజు అతను ఓ తోటలోంచి వెళుతుండగా ఒక చిట్టి చిలుక క్రింద పడి ఉండటం చూశాడు. దానికి ఇంకా రెక్కలు  సరిగ్గా పెరగని కారణంగా అది ఎగరలేకపోతోంది. దాని తల్లి చెట్టు కొమ్మల మీద కంగారుగా అరుస్తూ అటూ ఇటూ తిరుగితోంది.  అది గమనించిన ఖాలిద్‌ మనసు లో ఈ అపాయానికిగానూ ఒక ఉపాయం  తోచింది. అతను ఆ చిట్టి చిలుకను చేతిలో తీసుకొని నెమ్మదిగా చెట్టెక్కి చిలుక గూటిలో దానిని వదిలాడు.
  ఖాలిద్‌ చెట్టు దిగిన తర్వాత తల్లి చిలుక కృతజ్ఞతగా ఖాలిద్‌ని చూస్తూ, తన చిట్టి పాపాయితో సంతోషంగా గూటిలో కూర్చుంది. ఖాలిద్‌ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళి తన ఆనందాన్ని  నాన్నతో షేర్‌ చేెసుకున్నాడు. సాంతం విన్న నాన్న 'శభాష్‌ ఖాలిద్‌!' అంటూ భుజం తట్టి అతని నుదుటిని ముద్దాడి అతన్ని మెచ్చుకున్నాడు. అల్లాహ్‌ నీకు, నీవు చేెసిన మంచి పనిగానూ మహా గొప్ప ప్రతిఫలం ప్రసాదించాలని దీవించాడు. చూశారా! పిలల్లలూ! మనము కూడా జంతువులతో, పక్షులతో ఇలానే మంచిగా వ్యహరించాలి.

కొన్ని శబ్దాలకు గల అరబీ పేర్లు

నషీష్‌: అన్నము ఉడికేటప్పుడు వచ్చే కుతకుత శబ్దం నషీష్‌.
రనీన్‌: బాణం విసిరినప్పుడు ధనస్సు నుండి వచ్చే శబ్దం.
ఖదీఫ్‌: భయంకర స్వరాన్ని, సముద్ర అలల హోరును ఖదీఫ్‌   అంటారు.
ఖాఖఆహ్‌ా: ఆయుధము, ఎండినపోయిన చర్మము లేదా కాగితము నుండి వచ్చే శబ్దం.
గర్‌గరహ్‌: మనిషికి మరణం సమీమించినప్పుడు ప్రాణం పోతూ పోతూ ఉండగా వచ్చే శబ్దం.
అజీజ్‌: ఉరుము, మెరుపు శబ్దాన్ని మరియు స్త్రీ శబ్దాన్ని అజీజ్‌ అంటారు.
ఖష్‌ఖష: కొత్త దుస్తులు లేదా కాగితం నుండి వచ్చే శబ్దం.

చూసి నేర్చుకో!

ఆకాశాన్ని చూసి అంతటి ఎత్తుకు ఎలా ఎదగాలో నేర్చుకో
పుడమి వైపు దృష్టి సారించి దాతృగుణాన్ని నేర్చుకో
పర్వతాన్ని చూసి స్థిరత్వాన్ని, నిలకడను నేర్చుకో.
ఖర్జూరపు చెట్టును చూసి సహిష్ణుతను నేర్చుకో
ఒంటెను చూసి సహనం నేర్చుకో.
సాగరాన్ని చూసి కావ్యం నేర్చుకో.
పూలను చూసి  అందంగా ఎలా జీవించాలో నేర్చుకో.

మీకు తెలుసా?

తన నోటి పైభాగాన్ని కదిలించగలిగే ఏకైక జంతువు మొసలి.
డాల్ఫిన్‌ నిదురపోయేటప్పుడు ఒక కన్ను మాత్రమే మూసు కుంటుంది.
ప్రపంచంలో అన్నింటికంటే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌ శిఖరం. దాని ఎత్తు అక్షరాల 8848 మీటర్లు.
తాబేలుకు పల్లుండవు.

ముత్యాల మూటలు


నెలవంక

ధనంతో కొనలేనివి 

ధనంతో పుస్తకాలు కొనవచ్చు, జ్ఞానం కాదు.
ధనంతో మందుమాకు కొనవచ్చు ఆరోగ్యం కాదు.
ధనంతో అందమైన వస్తువులు కొనవచ్చు అందం కాదు.
ధనంతో అద్దం కొనవచ్చు చూపు కాదు.
ధనంతో అద్దాల మేడ కొనవచ్చు ఆత్మ శాంతి కాదు.
ధనంతో మనిషిని కొనవచ్చు మనసుని కాదు.
ధనంతో ధనాన్ని కొనవచ్చు అభిమానధనాన్ని కాదు.
ధనంతో దేన్నయినా కొనవచ్చు ధర్మాన్ని కాదు.

మనీషి - మృగం 

జంతువులకు కోరిక ఉంటుంది తెలివి(అఖల్‌) ఉండదు.
దైవదూతకు తెలివి ఉంటుంది. కోరికలుండవు.
మానవులకు తెలివి, కోరిక రెండూ ఉంటాయి.
మనిషి తెలివి ద్వారా కోరికల్ని అదుపు చేసుకుంటే దైవదూతల్లో చేరి పోతాడు.
కోరికల కర్రిమబ్బు తెలివిపై క్రమ్ముకుంటే జంతువులలో చేరిపోతాడు.

ఒకటింకొకటిని హరించివేస్తుంది

లంచం న్యాయాన్ని హరించివేస్తుంది.
నింద(గీబత్‌)కర్మలను హరించివేస్తుంది.
కోపం బుద్ధి,వివేకాన్ని హరించివేస్తుంది.
ఆలోచన వయసుని హరించివేస్తుంది.
పశ్చాత్తాపం పాపాన్ని హరించివేస్తుంది.
ఉపకారము చెడుని హరించివేస్తుంది.
అబద్ధము జీవనోపాధిని హరించివేస్తుంది.
అసూయ పుణ్యకార్యాన్ని హరించివేస్తుంది.
ధనాశ మానవత్వాన్ని హరించివేస్తుంది.

మహితుల మహితోక్తులు

పరదూషణ, అంగలార్పు నుండి తన నాలుకని కాపాడుకోండి శాంతి కలుగుతుంది. - అబూబకర్‌ (ర)
దౌర్జన్యుణ్ణి క్షమించటం అంటే బాధితునిపై దౌర్జన్యం అవుతుంది.   - ఉమర్‌బిన్‌ ఖత్తాబ్‌(ర)
పశ్చాత్తాపం కన్నా పాపాన్ని వదలటమే సులభం.    - ఉస్మాన్‌ (ర)
ఆత్మ సంతృప్తి సకల సంపదలకన్నా శ్రేయస్కరం.     - (అలీ (ర)
మంచి అంటే చెడునుంచి దూరముండటమే.           - ఆయిషా (ర)
అజ్ఞాని కోసం మౌనం కంటే గొప్పది మరేదీ లేదు.    - షేక్‌ సాదీ  
జ్ఞాని మృదువుస్వభావుడై ఉండాలి.                      - ఇమామ్‌ గజాలి (ర)
గుణపాఠం కోసం చావు చాలు.                              - ఉమర్‌ ఫారూఖ్‌ (ర)

  

బల్పం పట్టి పూ ఒడిలో అ ఆ ఇ ఈ... నేర్చుకుందాం!


- నెలవంక

అ ంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా వుంటుంది.
ఆ ందోళన మనిషికి అనారోగ్యాన్నీ బలహీనతని పెంచు తుంది.
ఇ తరులకు మేలు చేయటమంటే తనకు తాను ఉపకారం చేసుకోవటమే.
ఈ లోకంలో విశ్వాసం ఘనమైన ధనం. ధర్మాన్ని అనుసరించి  జీవించటం సౌఖ్యం. సర్వరుచులలో సత్యం అమిత రుచికరం. ప్రజ్ఞతో కూడిన జీవితం ఉత్తమం.
ఉ త్తమ గుణాలు దైవానికి దగ్గరగా చేస్తే, దుర్గుణాలు దైవానికి దూరంగా చేస్తాయి.
ఊ హకూ, బ్రతుక్కూ మధ్యన వంతెన ఉండాలి.
ఎ ంత చదివినా, ఎంత నేర్చుకున్నా దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఫలితం ఉండదు. ఆహారాన్ని నమిలినా మింగకుండా వుంటే ఎలా వ్యర్థమవుతుందో ఆచరణ లేని జ్ఞానమూ అంతే.
ఏ రంగున ముంచబడిన వస్త్రం ఆ రంగును పొందినట్లుగా సత్పురుషుడు, దుష్టుడు, తపస్వి, దొంగ-వీరిలో ఎవరి సాహ చర్యంలో గడిపితే, వారి గుణాలే మనిషికి అబ్బుతాయి.
ఐ శ్వర్యానికి ఆభరణం మంచితనం. విద్యకు అలంకారం నీతి. ధనానికి అలంకారం దానం. అన్ని గుణాలకీ అలంకారం మంచి శీలం.
ఒ ంటికి అందం చక్కటి దుస్తులు. మనసుకు అందం ఆనంద ప్రదమైన ఆలోచన. దైవభీతి ఆభరణం.
ఓ మర్రిగింజ మహావృక్ష మైనట్టే, చిత్తశుద్ధితో చేసే చిన్న సత్కార్యం మహాఫలితానిస్తుంది.
ఔ దార్యం ఉన్న హృదయం అమూల్య హృదయంగా పరిణతి చెందుతుంది.

Monday 3 March 2014

స్థిత ప్రజ్ఞులు




హజ్రత్‌ లుఖ్మాన్‌ (అ) గారి సత్యోక్తి

జ్ఞానం మంచిది (హసన్‌). సహనంతో కూడిన జ్ఞానం చాలా మంచిది (అహ్‌సన్‌). మౌనం మంచిది (హసన్‌). మౌనంలో ప్రవీణత ఉంటే చాలా మంచిది (అహ్‌సన్‌). నా కుమారా! నాలుక శరీరానికి ప్రతినిధి. కావున నీ నాలుకతో నీ శరీరాన్ని హానికలిగించే విషయాల నుంచి దాన్ని దూరముంచు. లేదా అల్లాహ్‌ యొక్క ఆగ్రహం నీపై విరిచుకు పడుతుంది.

అమూల్యమైన ఉపదేశం

విద్యార్జన ప్రతి ఒక్కరి ముఖ్యావసరం. అది శ్రమతో, శ్రద్ధతో కూడుకున్న విషయం. దాన్ని కాపాడుకోవటం కోసం అంకిత భావం అవసరం. దాన్ని ఆచరిస్తూ కాపాడుకోవాలంటే సంకల్పశుద్ధి చాలా అవసరం.

నిర్దయమైన హృదయం - ఎన్ని ఆధారాలున్నా సత్యాన్ని స్వీకరించదు.

ఆచరించేటప్పుడు అల్లాహ్‌ నిన్ను చూస్తున్నాడనీ, మాట్లాడేటప్పుడు అల్లాహ్‌ వింటున్నాడనీ, మౌనం వహించేటప్పుడు నీ మదిలో దాగిన రహస్యాలను సయితం ఆయనకు తెలుసునని గుర్తించుకో!

తౌహీద్‌ లేకపోతే ఏ ఆచరణా స్వీకరించబడదు.

మీకు తెలుసా ?
అయిదు విషయాలు అల్లాహ్‌కు తప్ప మరెవరికీ తెలియదు.(1) ప్రళయానికి సంబంధించిన జ్ఞానం.(2) వర్షం
గురించి .(3) మాతృగర్భంలో ఏముందో. (4) తాను రేపు ఏం చేయనున్నాడో.(5) తాను ఏ గడ్డపై మరణిస్తాడో.

బైతుల్‌ ముఖద్దస్‌లో ఖుబ్బతుస్సఖ్‌ర నిర్మించాలని ఆదేశించినవారు ఉమవీ ఖలీఫా అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ మర్వాన్‌.

 దైవగ్రంథం ఖుర్‌ఆన్‌లో 114 సూరాలు (అధ్యాయాలు)న్నాయి.

మస్జిదున్నబవీని మొట్టమొదట సారి (తౌసీ) విస్తీరణ పరచినవారు ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌(ర)

నూహ్‌ తూఫాన్‌ తరువాత మొట్టమొదట సారి విగ్రహారాధనకు గురైవవారు అరబ్‌కు చెందిన ఆద్‌ జాతి వారు.

దజ్జాల్‌ భూమిలో 40 రోజులుంటాడు. ఒక రోజు ఒక సంవత్సరం. ఒక రోజు ఒక నెల. ఒక రోజు ఒక
వారంలా. మిగితా రోజులు మామూలుగానే ఉంటాయి. అనగా రెండు సంవత్సరాల రెండు నెలల 15
రోజులన్నమాట.

సృష్టిలో మొట్టమొదట సృష్టించబడింది కలము. అల్లాహ్‌ ఆజ్ఞ ప్రకారం ఆది నుండి అంతం వరకు జరిగే
విషయాలన్నింటినీ అది లిఖించింది.

మనుషులు నాలుగు రకాలు
1- జ్ఞాని: తన తెలిసింది ఏ పాటిదో  తెలుసుకున్నవాడు. అతనికి సలాం చేయండి.
2- మరచినవాడు: తనకు తెలుసన్న విషయం తెలియనివాడు.అతన్ని గుర్తు చేయండి.
3- అజ్ఞాని: తనకు తెలియదన్న విషయం తెలుకున్నవాడు. అతన్నినేర్పించండి.
4- మూర్ఖుడు: తనకు తెలియదన్న విషయం తెలియనివాడు. అతనికి దూరగా ఉండండి.

మంచి మాటలు
 అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికిమాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది.(గురజాడ)
 అందమైన ప్రతీది మంచిది కాదు, కానీ మంచిది మాత్రం అందమైనదే.
 చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే, చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేయగల్గుతాడు.( జి.ముర్రే)
అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ( రామకృష్ణ పరమహంస)
 ఇతరులు మనం చెప్పినట్లు చేయాలని ఆశించడమే మనం చేసే మొదటి తప్పు.   (సిసిరో)
 తనకై తాను మంచి విద్యార్థి కాలేని వాడు ఎన్నటికీ మంచి ఉపాధ్యాయుడు కాలేడు. (లాలా లజపతి రాయ్‌)

జోలాలి


- అబుల్‌ హసన్‌

జోలాలి యా అల్లాహ్‌ అంటూ అంటూ; నువ్‌
మేల్కోవాలి సల్లీ అలా అంటూ అంటూ

దుష్టుల దౌష్ట్యాలను సహించాలి
ధూర్తుల దురాగతాలను భరించాలి
మమతల మల్లెలు జల్లుకుంటూ ఆగక నువ్‌
సాగిపోవాలి 'యా రహీమ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
ముళ్ళ బాటనైనా నడవాలి దాన్ని
పూదోటగా మలచుకోవాలి ప్రతి క్షేత్రంలో
నువ్‌ మకుటం లేని మారాజుగా ఎదగాలి
'యా ఫత్తాహ్‌! యా ముయిజ్జ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
సాత్వికత నీ సఖి, శిఖి అవ్వాలి
ప్రజలందరితో నువ్‌ ప్రేమగా మెలగాలి
విధేయతా పూలు నీలో విరబూయాలి
ఖుర్‌ఆన్‌ చేబూని నువ్‌ కదలాలి
'అజిల్‌ ఇలైక రబ్బీ లి తర్ద్వా' అంటూ అంటూ
                                ''జోలాలి....''
కర్రి మబ్బుల్లో వెలుగు ముగ్గులు వేయాలి
దిక్కులన్నీ పిక్కటిల్లేలా సత్య శంఖం ఊదాలి
నువ్‌ మసక చీకట్లను పారద్రోలాలి
'అల్లాహు నూరుస్సమావాతి వల్‌ అర్జ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
కలత చెందిన మనసుల్లో శాంతి సౌరభాలు జల్లాలి
కరడు గట్టిన గుండెల్లో కరుణ రసాలు నింపాలి
నువ్‌ కారుణ్యమూర్తి బాటన నడవాలి
'ఇన్నక లఅలా ఖులుఖిన్‌ అజీమ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
అవరోధాల్ని, అడ్డుగోడల్ని అవలీలగా దాటాలి
నువ్‌ ధర్మోన్నతి కోసం పాటు పడాలి
నువ్‌ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి
'యా జల్‌ జలాలి వల్‌ ఇక్రామ్‌' అంటూ అంటూ
                                  ''జోలాలి....''