Wednesday 12 March 2014

ముత్యాల మూటలు


నెలవంక

ధనంతో కొనలేనివి 

ధనంతో పుస్తకాలు కొనవచ్చు, జ్ఞానం కాదు.
ధనంతో మందుమాకు కొనవచ్చు ఆరోగ్యం కాదు.
ధనంతో అందమైన వస్తువులు కొనవచ్చు అందం కాదు.
ధనంతో అద్దం కొనవచ్చు చూపు కాదు.
ధనంతో అద్దాల మేడ కొనవచ్చు ఆత్మ శాంతి కాదు.
ధనంతో మనిషిని కొనవచ్చు మనసుని కాదు.
ధనంతో ధనాన్ని కొనవచ్చు అభిమానధనాన్ని కాదు.
ధనంతో దేన్నయినా కొనవచ్చు ధర్మాన్ని కాదు.

మనీషి - మృగం 

జంతువులకు కోరిక ఉంటుంది తెలివి(అఖల్‌) ఉండదు.
దైవదూతకు తెలివి ఉంటుంది. కోరికలుండవు.
మానవులకు తెలివి, కోరిక రెండూ ఉంటాయి.
మనిషి తెలివి ద్వారా కోరికల్ని అదుపు చేసుకుంటే దైవదూతల్లో చేరి పోతాడు.
కోరికల కర్రిమబ్బు తెలివిపై క్రమ్ముకుంటే జంతువులలో చేరిపోతాడు.

ఒకటింకొకటిని హరించివేస్తుంది

లంచం న్యాయాన్ని హరించివేస్తుంది.
నింద(గీబత్‌)కర్మలను హరించివేస్తుంది.
కోపం బుద్ధి,వివేకాన్ని హరించివేస్తుంది.
ఆలోచన వయసుని హరించివేస్తుంది.
పశ్చాత్తాపం పాపాన్ని హరించివేస్తుంది.
ఉపకారము చెడుని హరించివేస్తుంది.
అబద్ధము జీవనోపాధిని హరించివేస్తుంది.
అసూయ పుణ్యకార్యాన్ని హరించివేస్తుంది.
ధనాశ మానవత్వాన్ని హరించివేస్తుంది.

మహితుల మహితోక్తులు

పరదూషణ, అంగలార్పు నుండి తన నాలుకని కాపాడుకోండి శాంతి కలుగుతుంది. - అబూబకర్‌ (ర)
దౌర్జన్యుణ్ణి క్షమించటం అంటే బాధితునిపై దౌర్జన్యం అవుతుంది.   - ఉమర్‌బిన్‌ ఖత్తాబ్‌(ర)
పశ్చాత్తాపం కన్నా పాపాన్ని వదలటమే సులభం.    - ఉస్మాన్‌ (ర)
ఆత్మ సంతృప్తి సకల సంపదలకన్నా శ్రేయస్కరం.     - (అలీ (ర)
మంచి అంటే చెడునుంచి దూరముండటమే.           - ఆయిషా (ర)
అజ్ఞాని కోసం మౌనం కంటే గొప్పది మరేదీ లేదు.    - షేక్‌ సాదీ  
జ్ఞాని మృదువుస్వభావుడై ఉండాలి.                      - ఇమామ్‌ గజాలి (ర)
గుణపాఠం కోసం చావు చాలు.                              - ఉమర్‌ ఫారూఖ్‌ (ర)

  

No comments:

Post a Comment