Monday 3 March 2014

స్థిత ప్రజ్ఞులు




హజ్రత్‌ లుఖ్మాన్‌ (అ) గారి సత్యోక్తి

జ్ఞానం మంచిది (హసన్‌). సహనంతో కూడిన జ్ఞానం చాలా మంచిది (అహ్‌సన్‌). మౌనం మంచిది (హసన్‌). మౌనంలో ప్రవీణత ఉంటే చాలా మంచిది (అహ్‌సన్‌). నా కుమారా! నాలుక శరీరానికి ప్రతినిధి. కావున నీ నాలుకతో నీ శరీరాన్ని హానికలిగించే విషయాల నుంచి దాన్ని దూరముంచు. లేదా అల్లాహ్‌ యొక్క ఆగ్రహం నీపై విరిచుకు పడుతుంది.

అమూల్యమైన ఉపదేశం

విద్యార్జన ప్రతి ఒక్కరి ముఖ్యావసరం. అది శ్రమతో, శ్రద్ధతో కూడుకున్న విషయం. దాన్ని కాపాడుకోవటం కోసం అంకిత భావం అవసరం. దాన్ని ఆచరిస్తూ కాపాడుకోవాలంటే సంకల్పశుద్ధి చాలా అవసరం.

నిర్దయమైన హృదయం - ఎన్ని ఆధారాలున్నా సత్యాన్ని స్వీకరించదు.

ఆచరించేటప్పుడు అల్లాహ్‌ నిన్ను చూస్తున్నాడనీ, మాట్లాడేటప్పుడు అల్లాహ్‌ వింటున్నాడనీ, మౌనం వహించేటప్పుడు నీ మదిలో దాగిన రహస్యాలను సయితం ఆయనకు తెలుసునని గుర్తించుకో!

తౌహీద్‌ లేకపోతే ఏ ఆచరణా స్వీకరించబడదు.

మీకు తెలుసా ?
అయిదు విషయాలు అల్లాహ్‌కు తప్ప మరెవరికీ తెలియదు.(1) ప్రళయానికి సంబంధించిన జ్ఞానం.(2) వర్షం
గురించి .(3) మాతృగర్భంలో ఏముందో. (4) తాను రేపు ఏం చేయనున్నాడో.(5) తాను ఏ గడ్డపై మరణిస్తాడో.

బైతుల్‌ ముఖద్దస్‌లో ఖుబ్బతుస్సఖ్‌ర నిర్మించాలని ఆదేశించినవారు ఉమవీ ఖలీఫా అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ మర్వాన్‌.

 దైవగ్రంథం ఖుర్‌ఆన్‌లో 114 సూరాలు (అధ్యాయాలు)న్నాయి.

మస్జిదున్నబవీని మొట్టమొదట సారి (తౌసీ) విస్తీరణ పరచినవారు ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌(ర)

నూహ్‌ తూఫాన్‌ తరువాత మొట్టమొదట సారి విగ్రహారాధనకు గురైవవారు అరబ్‌కు చెందిన ఆద్‌ జాతి వారు.

దజ్జాల్‌ భూమిలో 40 రోజులుంటాడు. ఒక రోజు ఒక సంవత్సరం. ఒక రోజు ఒక నెల. ఒక రోజు ఒక
వారంలా. మిగితా రోజులు మామూలుగానే ఉంటాయి. అనగా రెండు సంవత్సరాల రెండు నెలల 15
రోజులన్నమాట.

సృష్టిలో మొట్టమొదట సృష్టించబడింది కలము. అల్లాహ్‌ ఆజ్ఞ ప్రకారం ఆది నుండి అంతం వరకు జరిగే
విషయాలన్నింటినీ అది లిఖించింది.

మనుషులు నాలుగు రకాలు
1- జ్ఞాని: తన తెలిసింది ఏ పాటిదో  తెలుసుకున్నవాడు. అతనికి సలాం చేయండి.
2- మరచినవాడు: తనకు తెలుసన్న విషయం తెలియనివాడు.అతన్ని గుర్తు చేయండి.
3- అజ్ఞాని: తనకు తెలియదన్న విషయం తెలుకున్నవాడు. అతన్నినేర్పించండి.
4- మూర్ఖుడు: తనకు తెలియదన్న విషయం తెలియనివాడు. అతనికి దూరగా ఉండండి.

మంచి మాటలు
 అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికిమాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది.(గురజాడ)
 అందమైన ప్రతీది మంచిది కాదు, కానీ మంచిది మాత్రం అందమైనదే.
 చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే, చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేయగల్గుతాడు.( జి.ముర్రే)
అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ( రామకృష్ణ పరమహంస)
 ఇతరులు మనం చెప్పినట్లు చేయాలని ఆశించడమే మనం చేసే మొదటి తప్పు.   (సిసిరో)
 తనకై తాను మంచి విద్యార్థి కాలేని వాడు ఎన్నటికీ మంచి ఉపాధ్యాయుడు కాలేడు. (లాలా లజపతి రాయ్‌)

No comments:

Post a Comment