Wednesday 12 March 2014

బల్పం పట్టి పూ ఒడిలో అ ఆ ఇ ఈ... నేర్చుకుందాం!


- నెలవంక

అ ంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా వుంటుంది.
ఆ ందోళన మనిషికి అనారోగ్యాన్నీ బలహీనతని పెంచు తుంది.
ఇ తరులకు మేలు చేయటమంటే తనకు తాను ఉపకారం చేసుకోవటమే.
ఈ లోకంలో విశ్వాసం ఘనమైన ధనం. ధర్మాన్ని అనుసరించి  జీవించటం సౌఖ్యం. సర్వరుచులలో సత్యం అమిత రుచికరం. ప్రజ్ఞతో కూడిన జీవితం ఉత్తమం.
ఉ త్తమ గుణాలు దైవానికి దగ్గరగా చేస్తే, దుర్గుణాలు దైవానికి దూరంగా చేస్తాయి.
ఊ హకూ, బ్రతుక్కూ మధ్యన వంతెన ఉండాలి.
ఎ ంత చదివినా, ఎంత నేర్చుకున్నా దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఫలితం ఉండదు. ఆహారాన్ని నమిలినా మింగకుండా వుంటే ఎలా వ్యర్థమవుతుందో ఆచరణ లేని జ్ఞానమూ అంతే.
ఏ రంగున ముంచబడిన వస్త్రం ఆ రంగును పొందినట్లుగా సత్పురుషుడు, దుష్టుడు, తపస్వి, దొంగ-వీరిలో ఎవరి సాహ చర్యంలో గడిపితే, వారి గుణాలే మనిషికి అబ్బుతాయి.
ఐ శ్వర్యానికి ఆభరణం మంచితనం. విద్యకు అలంకారం నీతి. ధనానికి అలంకారం దానం. అన్ని గుణాలకీ అలంకారం మంచి శీలం.
ఒ ంటికి అందం చక్కటి దుస్తులు. మనసుకు అందం ఆనంద ప్రదమైన ఆలోచన. దైవభీతి ఆభరణం.
ఓ మర్రిగింజ మహావృక్ష మైనట్టే, చిత్తశుద్ధితో చేసే చిన్న సత్కార్యం మహాఫలితానిస్తుంది.
ఔ దార్యం ఉన్న హృదయం అమూల్య హృదయంగా పరిణతి చెందుతుంది.

No comments:

Post a Comment